
సమష్టి సహకారంతో ఏఐ సదస్సు విజయవంతం
షాద్‌నగర్‌రూరల్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై నిర్వహించిన జాతీయ సదస్సు అందరి సహకారంతోనే విజయవంతమయిందని ప్రిన్సిపాల్ డాక్టర్ నీతా పోలే అన్నారు. పట్టణ సమీపంలోని గిరిజన గురుకుల మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ సహకారంతో విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకుకృషి చేస్తున్నామని అన్నారు. యాంత్రిక యుగంలో టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రభుత్వం విద్యా బోధనలోనూ మార్పులు తీసుకువస్తోందన్నారు. ఇందులో భాగంగా షాద్‌నగర్ పట్టణంలో ఏఐ పై జాతీయ సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, గిరిజన గురుకులాల కార్యదర్శి సీతాలక్ష్మి సహకారం ఎనలేనిదని అన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హాజరు విద్యార్థుల్లో సంతోషాన్ని నింపిందని అన్నారు. జాతీయ స్థాయి సదస్సు విద్యార్ధుల్లో ఎంతో ప్రేరణకలిగించిందని అన్నారు.
ప్రిన్సిపాల్ డాక్టర్ నీతా పోలే