
న్యాయం కోరితే అరెస్టులా?
బషీరాబాద్: కేంద్ర ప్రభుత్వం అంగన్‌వాడీలను నిర్వీర్యం చేయడానికి తీసుకువచ్చిన జాతీయ విద్యావిధానాన్ని వ్యతిరేకిస్తే పోలీసులు ఆడవాళ్లని చూడకుండా ఈడ్చుకుంటూ అరెస్టులు చేశారని తాండూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు అధ్యక్షురాలు బాలమణి మండిపడ్డారు. సోమవారం కొడంగల్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ముందు వికారాబాద్, నారాయణపేట జిల్లాల నుంచి ఆందోళన చేసిన వారిలో 65 మంది అంగన్‌వాడీ టీచర్లను బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారు పీఎస్ ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీవిద్యను అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా కేంద్రాల్లో ఏర్పాటుచేసిన ఎఫ్‌ఆర్‌ఎస్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మగ పోలీసులు ఆడవారిపట్ల దురుసుగా ప్రవర్తించారని, రాష్ట్ర కార్యదర్శి పి.జయలక్ష్మికి తీవ్రగాయాలు అయ్యాయని మండిపడ్డారు. అనంతరం సొంత పూచీకత్తుపై వారిని పోలీసులు విడిచిపెట్టారు. కార్యక్రమంలో నారాయణపేట సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలరామ్, ఐసీడీఎస్ వికారాబాద్ ప్రాజెక్టు అధ్యక్షురాలు విజయలక్ష్మీ, నారాయణపేట అధ్యక్షురాలు శశికళతో పాటు 65 మంది టీచర్లు పాల్గొన్నారు.
అంగన్‌వాడీ టీచర్ల ముందస్తు అరెస్టు
బంట్వారం: చలో కొడంగల్ నినాదంతో ధర్నాకు బయులుదేరిన పలువురు అంగన్‌వాడీ టీచర్లను కోట్‌పల్లి ఎస్‌ఐ శైలజ సోమవారం ముందస్తు అరెస్టు చేశారు. అక్రమ నిర్బంధాలు తమ ఉద్యమాన్ని ఆపలేవని, అంగన్‌వాడీల డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు.
ప్రభుత్వంపై అంగన్‌వాడీల ధ్వజం

న్యాయం కోరితే అరెస్టులా?