
రేషన్ బియ్యం పట్టివేత
యాచారం: అక్రమంగా తరలిస్తున్న ఆరు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. యాచారం సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. మాల్ కేంద్రంలో సోమవారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో కడ్తాల్ మండల పరిధిలోని పల్లెచల్కతండాకు చెందిన మోతీలాల్ టాటాసుమో వాహనంలో ఆరు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నాడు. బియ్యం గురించి ఆయన్ను ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేదు. దీంతో వాహనాన్ని టాటాసుమోలో ఉన్న రేషన్ బియ్యంపై విచారించగా సరైన వివరాలు తెలియజేయలేదు. దీంతో వాహనాన్ని, బియ్యాన్ని సీజ్ చేసి మోతీలాల్‌ను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
రైలు పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం
కొత్తూరు: పట్టణంలోని రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలపై సోమవారం స్థానికులు ఓ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న రైల్వే హెడ్‌కానిస్టేబుల్ మల్లేశ్ మృతదేహం పడిన తీరును పరిశీలించి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. మృతుడి వయస్సు 30–35 ఏళ్లు, ఉంటుందని తెల్లటి బనియన్ ధరించాడని చెప్పారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించామన్నారు, తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ మాస్టర్ వినీత్‌కుమార్ ఫిర్యాదు మేర కు కేసు దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
‘సింబయాసిస్’లో కార్మికుడి మృతి
నందిగామ: వర్సిటీలో వా టర్ ట్యాంక్ శు భ్రం చేసేందుకు వెళ్లిన కార్మికుడు ప్రమాదవశాత్తు ట్యాంక్‌లో పడి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని మొదళ్లగూడ శివారు సింబయాసిస్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో సోమ వారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ తెలిపిన ప్రకారం.. మ హారాష్ట్రలోని సాతర జిల్లా కున్నీ గ్రామానికి చెందిన అమిత్‌కుమార్ కై మొడే(32) కొంత కాలంగా వర్సిటీలో హిప్రో వాష్ క్లీనింగ్ స ర్వీస్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కళాశాల భవనంపై ఉన్న ట్యాంక్ శుభ్రంచేస్తున్న క్ర మంలో ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. గమనించిన వర్సిటీ నిర్వాహకులు పోలీసులకు సమా చారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసు లు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మట్టి తరలిస్తున్న లారీ సీజ్
హయత్‌నగర్: అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఓ లారీని పోలీస్‌లు సీజ్ చేశా రు. సీఐ నాగరాజు గౌడ్ తెలిపిన ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొ హెడాలో ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డులో సోమవారం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అటుగా వస్తున్న లారీని నిలిపి తనిఖీలు చేపట్టగా ఎటువంటి అనుమతి పత్రాలు లేవు. దీంతో స్థానిక తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డికి సమాచా రం ఇచ్చారు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు డ్రైవర్ దయాకర్‌రెడ్డిపై కేసు నమో దు చేసి లారీని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
ఎనిమిది మంది అరెస్ట్
శంకర్‌పల్లి: పేకాట స్థావరంపై రాజేంద్రనగర్ ఎస్‌ఓటీ, శంకర్‌పల్లి పోలీసులు సంయుక్తంగా సోమవారం దాడులు నిర్వహించారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. మున్సిపల్ శివారులోని అల్ట్రాటెక్ కంపెనీలో పని చేస్తున్న డ్రైవర్లు, కంపెనీలోని వెయిటింగ్ రూంలో పేకాడుతున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఎస్‌ఓటీ, శంకర్‌పల్లి పోలీసులు దాడులు చేయగా ఎనిమిది మంది పేకాడుతూ చిక్కారు. వారి వద్ద నుంచి రూ.10,970 నగదు, ఎనిమిది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.