
నీటి వెతలు బోలెడు.. చేతి పంపే చేదోడు
తాండూరు రూరల్: సరైన నీటి సౌకర్యం లేక మండల పరిధిలోని ఓగిపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 49 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలలో ఒక హెచ్‌ఎం, ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. తాగునీటికి సంబంధించి ఎలాంటి నల్లా కనెక్షన్ లేదని విద్యార్థులు వాపోతున్నారు. తాగడానికి ఇంటి నుంచి వాటర్ బాటిళ్లు తెచ్చుకుంటున్నామని చెబుతున్నారు. అలాగే పాఠశాలలో టాయిలెట్లకు నీటి సరఫరా లేదు. ట్యాంక్ ఉన్నా నిరుపయోగంగా ఉంది. పాఠశాల ఆవరణలో ఉన్న చేతి పంపు నుంచి నీటిని తీసుకొని అవసరాలకు వాడుకుంటున్నామని చిన్నారులు తెలుపుతున్నారు. సోమవారం మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత చేతిపంపు కొట్టి విద్యార్థులు ప్లేట్లు కడుక్కుంటుండగా ‘సాక్షి’ కెమెరాకు చిక్కింది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.

నీటి వెతలు బోలెడు.. చేతి పంపే చేదోడు