
ఒక్కో రైతుకు రెండు బస్తాలు
తాండూరు రూరల్: మండలంలోని ఎల్మకన్నె పీఏసీఎస్ కార్యాలయం వద్ద సోమవారం రైతులకు యూరియా సరఫరా చేశారు. స్టాక్ వచ్చిన విషయం తెలుసుకున్న వివిధ గ్రామాల రైతులు ఉదయం నుంచే కార్యాలయం వద్ద క్యూలో నిల్చున్నారు. సొసైటీ సీఈఓ శ్రీనివాస్, అదనపు సీఈఓ చంద్రారెడ్డిలతో పాటు కార్యాలయ సిబ్బంది క్యూలో ఉన్న రైతులకు ఒక్కొక్కరికి రెండు బస్తా ల యూరియా టోకెన్లు రాసి ఇచ్చారు. ఎల్మకన్నె పీఏసీఎస్ కార్యాలయంకు 450 బస్తాల యూరియా వచ్చిందని క్యూలో ఉన్న రైతులకు ఒక్కొక్కరికి రెండు బస్తాల యూరియా పంపిణీ చేశామని వ్యవసాయశాఖ తాండూరు ఏడీఏ కొమురయ్య తెలిపారు. ఒక్క బస్తా ధర రూ.270కి పంపిణీ చేశామన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పట్టణ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
ఎల్మకన్నె పీఏసీఎస్ కార్యాలయం వద్ద యూరియా పంపిణీ