
జోరుగా రోడ్డు విస్తరణ పనులు
బషీరాబాద్: రూ.80 కోట్ల నిధులతో చేపట్టిన అగ్గనూర్–బషీరాబాద్ రోడ్డు విస్తరణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. రోడ్డుకు ఇరువైపుల ఉన్నా ఎవెన్యూ ప్లాంటేషన్ చెట్లు తొలగించడానికి అటవీ శాఖ అనుమతులు ఇవ్వడంతో పనులు జోరందుకున్నాయి. సోమవారం కాశీంపూర్ సమీపంలో సుమారు 200 చెట్లను తొలగించారు. దీంతో అగ్గనూర్– బషీరాబాద్ వరకు 16.8 కి.మీ రోడ్డును 13 మీటర్లు(43ఫీట్లు) వెడల్పుతో బీటీ వేయనున్నారు. రోడ్డుకు ఇరువైపుల షోల్డర్స్ 1.5మీటర్ల చొప్పున 3 మీటర్లు విస్తరణ చేస్తున్నట్లు ఆర్‌అండ్‌బీ ఏఈ రిషీవరుణ్ వివరించారు. అలాగే బషీరాబాద్– మైల్వార్ వరకు 11.6కి.మీ దూరం 7 మీటర్లు(23ఫీట్లు) వెడల్పుతో బీటీ రోడ్డు, షోల్డర్స్ మరో 3 మీటర్లు ఉండేలా విస్తరణ పనులు సాగుతున్నాయన్నారు. అగ్గనూర్ నుంచి విస్తరణ పనులు గొట్టిగఖుర్ధు సమీపం వరకు చేరుకున్నాయి. గడువులోపు పనులు పూర్తి చేయడానికి గుత్తేదారుకు ఆదేశాలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.
చెట్ల తొలగింపునకు తొలగిన అడ్డంకులు