
ఉన్నవి సరిపోవు..
వెంటాడుతున్న కార్మికుల సమస్య ఒక్కో పురపాలికలో రోజుకు 6నుంచి 50టన్నుల చెత్త రాక సేకరణ, తరలింపునకు తీవ్ర ఇబ్బందులు పట్టించుకోని పాలకులు, అధికారులు
మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు వాహనాల కొరత
కొత్తవి కొనరు
పన్నులు, అనుమతుల రూపంలో మున్సిపాలిటీలకు ఏటా కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది. జిల్లాలోని వికారాబాద్, తాండూరు పురపాలికలకు ఏటా రూ.10 కోట్ల పైనే ఆదాయం ఉంది. పరిగికి రూ.6 కోట్ల వరకు, కొడంగల్‌కు రూ.2 కోట్లు వరకు పన్నుల రూపంలో వస్తోంది. ఇంతటి ఆదాయం ఉన్నా చెత్త సేకరణకు వాహనాల కొనుగోలులో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఉన్నవి సరిపోక కొత్తవి రాకపోవడం, మరికొన్ని పాదవడంతో పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. మున్సిపాలిటీల్లో చెత్త వాహనాల కొరతపై ‘సాక్షి ’ ప్రత్యేక కథనం
మరో 14 అవసరం
కొడంగల్: మున్సిపల్ పరిధిలో కొడంగల్, పాత కొడంగల్, గుండ్లకుంట, బూల్కాపూర్, ఐనన్‌పల్లి, కొండారెడ్డిపల్లి గ్రామాలు ఉన్నాయి. వీటి పరిధిలో 12 వార్డులు, 18వేల జనాభా ఉంది. ఆయా గ్రామాల్లో చెత్త సేకరణకు నాలుగు ఆటోలు, రెండు ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. ఒక్కో ఆటో రెండు గ్రామాల్లో చెత్త సేకరించి కొడంగల్ సమీపంలోని డంప్ యార్డుకు తరలిస్తున్నారు. రెండు ట్రాక్టర్లు కొడంగల్ పట్టణంలో తిరిగి చెత్తను డంప్ యార్డుకు తరలిస్తున్నాయి. గతంలో కొనుగోలు చేసిన నాలుగు ఎలక్ట్రికల్ వాహనాలు (ఆటోలు) ప్రస్తుతం పనిచేయడం లేదు. వాటిని వాటర్ ట్యాంకు దగ్గర ఉంచారు. మున్సిపల్ పరిధిలో జనాభా రోజురోజుకూ పెరుగుతోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కొడంగల్‌లో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఉన్న వాహనాలు సరిపోవడం లేదు. కొడంగల్‌కు 8 ఆటోలు, గ్రామాల్లో చెత్త సేకరణకు మరో 6 ఆటోలు అవసరం ఉన్నట్లు తెలిసింది. పారిశుద్ధ్య కార్మికులకు సోపులు, ఇతర వస్తువుల కోసం డబ్బులు చెల్లిస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
నిరుపయోగంగా..
చెత్త బండ్లు
పరిగి: పరిగి మున్సిపాలిటీలో చెత్త సేకరణకు సరిపడా వాహనాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పట్టణ పరిధిలో 18 వార్డులు.. 40వేలకు పైగా జనాభా ఉంది. 48 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. 10 ఆటోలు, 3 ట్రాక్టర్లతో రోజుకు 8 టన్నుల చెత్త సేకరిస్తున్నారు. మూడు ఆటోలు చెడిపోయాయి. వాటికి మరమ్మతులు చేయించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పెరుగుతున్న కాలనీలు, జనాభాకు అనుగుణంగా మరో 3 ఆటోలు కొనుగోలు చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం పట్టణంలో చెత్త సేకరణ అధ్వానంగా మారింది. కాలనీల్లో చెత్త పేరుకుపోయింది.

ఉన్నవి సరిపోవు..

ఉన్నవి సరిపోవు..

ఉన్నవి సరిపోవు..

ఉన్నవి సరిపోవు..