
బీఆర్‌ఎస్ హయాంలోనే అభివృద్ధి
అనంతగిరి: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మండలంలోని ఆయా గ్రామాల ఎస్టీ, మైనార్టీ విభాగం ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ముస్లింలకు మంత్రివర్గంలో చోటు ఇవ్వని పార్టీ కాంగ్రెస్ అన్నారు. బీఆర్‌ఎస్ పాలనలోనే అభివృద్ధి జరిగిందన్నారు. అన్ని వర్గాలకు కేసీఆర్ సమాన్యాయం చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మైపాల్‌రెడ్డి, మైనార్టీ విభాగం మండల అధ్యక్షుడు గయాజ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు అశోక్, సీనియర్ నాయకులు పురుషోత్తంరెడ్డి, శివకుమార్, చాంద్‌పాషా, హైమద్ పాషా, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.