
భూ సమస్యలు పరిష్కరించాలి
సీఎంను కోరిన కాంగ్రెస్ నాయకుడు సంతోష్ నాయక్
బొంరాస్‌పేట: మండలంలోని బాపల్లి తండాలో రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు సంతోష్ నాయక్ సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. శనివారం ముఖ్యమంత్రిని నగరంలోని ఆయన నివాసంలో కలిసి ఈ మేరకు విన్నవించారు. అనంతరం సంతోష్ నాయక్ మాట్లాడుతూ.. తండాలోని పలువురు రైతులు ఏళ్ల తరబడి భూ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఈ సమస్యను సీఎం దృష్టికి తేగా భూ భారతి చట్టం ద్వారా పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
బోర్డు విధి విధానాలను వివరించండి
అనంతగిరి: సోషల్ జస్టిస్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో శనివారం వికారాబాద్ జిల్లా ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర చైర్మన్ దోర్నాల సత్యం మాట్లాడుతూ.. బోర్డు విధి విధానాలను ప్రతినిధులకు వివరించారు. సామాజిక న్యాయం కోసం చేయాల్సిన కృషిని, మహిళల సంక్షేమం కోసం చేపట్లాల్సిన కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో ప్రతినిధులు వేమారెడ్డి, శశిధర్, శ్రీధర్, వీరస్వామి, పాండుగౌడ్, రాములు, రాజేందర్‌గౌడ్, మహేష్, నర్సింలు, శ్రీనివాస్, అరుణ్, దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
అనంతగిరి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం వికారాబాద్ యూనిట్ ఎన్నికలు శనివారం నిర్వహించారు. ఈ కమిటీ 2025 – 28 వరకు కొనసాగనుంది. అధ్యక్షుడిగా ఎం మాణిక్యప్రభు, కార్యదర్శిగా బుచ్చ య్య, ఫైనాన్స్ కార్యదర్శిగా సతీష్‌చంద్ర, అసో సియేటేడ్ అధ్యక్షుడిగా బందెప్పగౌడ్, ఉపాధ్యక్షులుగా మొగులయ్య, జీవన్‌కుమార్, జాయింట్ సెక్రటరీగా జాషువా, ఆర్గనైజింగ్ సెక్రటరీ గా నాగభూషణం, పబ్లిసిటీ కార్యదర్శిగా సా యన్న, జిల్లా కౌన్సిలర్లుగా జనార్దన్, కిష్టయ్య ను ఎన్నుకున్నారు. అనంతరం నూతన అధ్యక్షుడు మాణిక్య ప్రభు మాట్లాడుతూ.. తమకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. విశ్రాంత ఉద్యోగుల హక్కుల సాధనం కోసం నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కోశాధికారి పెంటయ్య పాల్గొన్నారు. కార్యక్రమంలో సీనియర్ సభ్యులు దివాకర్‌రెడ్డి, నాగయ్య బొన్నల బస్వరాజు తదితరులు పాల్గొన్నారు.
రబీ సాగుకు సన్నద్ధం
పొలాలను చదును చేస్తున్న రైతన్న
దుద్యాల్: ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. భూగర్భ జలాలు పెరిగాయి. బోర్లలో సైతం నీళ్లు ఉన్నాయి. దీంతో రైతులు రబీ సాగుకు సిద్ధమవుతున్నారు. పొలాలను చదును చేసి పంటలు వేసేందుకు సమాయత్తమవుతున్నారు. ప్రస్తుత సీజన్‌లో వేరుశెనగ, తెల్ల కుసుమ, మొక్కజొన్న, బొబ్బర్లు, శనగ వంటి పంటలు వేసే అవకాశం ఉంది.

భూ సమస్యలు పరిష్కరించాలి

భూ సమస్యలు పరిష్కరించాలి

భూ సమస్యలు పరిష్కరించాలి