27వేల కేసులు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

27వేల కేసులు పరిష్కారం

Sep 14 2025 9:12 AM | Updated on Sep 14 2025 9:12 AM

27వేల కేసులు పరిష్కారం

27వేల కేసులు పరిష్కారం

● లోక్‌ అదాలత్‌కు విశేష స్పందన ● రాజీమార్గమే రాజమార్గం ● జిల్లా ప్రధాన న్యాయమూర్తి సున్నం శ్రీనివాస్‌రెడ్డి

అనంతగిరి: లోక్‌ అదాలత్‌కు వచ్చే ఇరువర్గాలు విజయం సాధించినట్లేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్‌. సున్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం వికారాబాద్‌ కోర్టు ఆవరణలో జాతీయ లోక్‌ అదాలత్‌లో భాగంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ కోర్టుల పరిధిలో మొత్తం 27వేల కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. ఇందులో ట్రాఫిక్‌ చలాన్లు, ఎలక్ట్రిసిటీ, ఈ – పిట్టీ కేసులు, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, బ్యాంకులు, చిన్న చిన్న తగాదాలు తదితర కేసులు ఉన్నాయన్నారు. ఇరువర్గాలు విశాల దృక్ఫథంతో ఆలోచిస్తే లోక్‌ అదాలత్‌ ద్వారా కేసుల నుంచి విముక్తి పొందవచ్చని తెలిపారు. రాజీ మార్గమే రాజమార్గమన్నారు. ప్రతి ఒక్కరికీ చట్టాలపై అవగాహన ఉండాలని సూచించారు. కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి చంద్రకిశోర్‌, జిల్లా న్యాయసేవ సెక్రటరీ, సీనియర్‌ సివిల జడ్జి వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి శాంతిలత, అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి వైష్ణవి, ఎస్పీ నారాయణరెడ్డి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బస్వరాజు, సీనియర్‌ న్యాయవాదులు మాధవరెడ్డి, నాగరాజు, వెంకటేష్‌, శ్రీనివాస్‌, పీపీలు మేరాజ్‌బేగం, అన్వేష్‌సింగ్‌, సమీనాబేగం, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సీఐలు భీంకుమార్‌, వెంకట్‌, రఘురాం, పలువురు అధికారులు, సీని యర్‌ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

సత్వర పరిష్కారం కోసమే..

కొడంగల్‌ రూరల్‌: కేసుల సత్వర పరిష్కారం కోసమే మెగా లోక్‌అదాలత్‌లు నిర్వహిస్తున్నట్లు కొడంగల్‌ మున్సిఫ్‌ కోర్టు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి బి.శ్రీరామ్‌ తెలిపారు. శనివారం పట్టణంలోని మున్షిఫ్‌ కోర్టులో నిర్వహించిన జాతీయ మెగా లోక్‌ అదాలత్‌లో 152 కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న చిన్న తగాదాలను కక్షిదారులు సమన్వయంతో పరిష్కరించుకునేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో లోక్‌ అదాలత్‌ సభ్యులు బస్వరాజ్‌ అడ్వకేట్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, న్యాయవాదులు ఏవీ ఆనంద్‌, రవీందర్‌ నాయక్‌, బీ వెంకటయ్య, టీ రాములు, కృష్ణయ్య, రమేష్‌, భానుప్రసాద్‌, భాగ్యలత తదితరులు పాల్గొన్నారు.

70 కేసులకు పరిష్కారం

తాండూరు: జాతీయ లోక్‌ అదాలత్‌లో 70 కేసులకు పరిష్కారం లభించింది. శనివారం తాండూరు కోర్డులో మండల్‌ లీడల్‌ అథారిటీ చైర్మన్‌, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌ శివలీల, అడిషనల్‌ జడ్జి అంబటి ప్రణయ ఆధ్వర్యంలో లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. సివిల్‌ కేసులు 2, సీసీ క్యాలెండర్‌ కేసులు 21, చెక్‌ బౌన్స్‌ కేసులు 2, నేరం ఒప్పుకోలు 14, ప్రాథమిక విచారణలో గల కేసులు 15, ఎకై ్సజ్‌ శాఖకు చెందిన 16 కేసులకు పరిష్కారం కల్పించారు. కార్యక్రమంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అన్వేష్‌ సింగ్‌, లోక్‌ అదాలత్‌ సభ్యులు మనోహర్‌రావు,ఎం.చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

పరిగిలో 261 కేసులకు..

పరిగి: జాతీయ లోక్‌ అదాలత్‌కు మంచి స్పందన వచ్చిందని పరిగి జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజీస్ట్రేట్‌ నాగులశిల్ప తెలిపారు. శనివారం పరిగి కోర్టు ఆవరణలో నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో 261 కేసులు పరిష్కరించినట్లు తెలి పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏజీపీ బాలముకుందం, లోక్‌ అదాలత్‌ సభ్యు లు బి.లింగం, శివారెడ్డి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఇబ్రహీంఖాన్‌, సీనియర్‌ న్యాయవాదులు ఆనంద్‌ గౌడ్‌, వెంకట్‌ రాములు, నర్సింహారెడ్డి, గౌస్‌పాషా, శ్రీనివాస్‌ యాదవ్‌, గోపాల్‌, వెంకటేశ్‌, డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐ మోహనకృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement