
స్కావెంజర్ల సమస్యలు పరిష్కరించాలి
దౌల్తాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కావెంజర్ల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్య డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్కావెంజర్లకు 11 నెలలుగా వేతనాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విషయమై కలెక్టర్‌కు విన్నవించినా పరిష్కారం కావడం లేదన్నారు. వెంటనే స్కావెంజర్ల సమస్యలు తీర్చాలని కోరారు. అనంతరం మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా వెంకటప్ప, కార్యదర్శిగా సయ్యద్ అలీ, ఉపాధ్యక్షుడిగా నర్సిములు, సహాయకార్యదర్శిగా బుగ్గప్పలతో పాటు కమిటీని ఎన్నుకున్నారు.
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రయ్య