
బాల్య వివాహాలను నిరోధించాలి
తాండూరు టౌన్: బాల్య వివాహాల అడ్డుకట్టకు పురోహితులు సహకరించాలని సాధన ఎన్జీఓ జిల్లా కో–ఆర్డినేటర్ రమేశ్‌యాదవ్ అన్నారు. శనివారం పట్టణంలోని శ్రీ భావిగి భద్రేశ్వర దేవాలయం, శ్రీకాళికాదేవి ఆలయంలో పురోహితులచే బాల్యవివాహాల నిర్మూలనకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలికలకు 18ఏళ్లు, బాలురకు 21 ఏళ్లు నిండిన తర్వాత మాత్రమే పెళ్లి జరిపించాలన్నారు. బాలికలకు బాల్య వివాహం చేయడంతో వారి మానసిక స్థితి, జీవన విధానంలో పెను మార్పులు సంభవించే ప్రమాదం ఉందన్నారు. సహజ సిద్ధమైన జీవనం కొనసాగించడంలో ఇబ్బందులకు గురవుతారన్నారు. కావున పురోహితులు, పాస్టర్లు, ఖాజీలు బాల్య వివాహాలకు సహకరించ రాదన్నారు. సమాజంలో ఎక్కడైనా బాల్య వివాహం జరిగే క్రమంలో వెంటనే 1098 లేదా 100 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సాధన సంస్థ ప్రతినిధులు నర్సిములు, రమేశ్, రోజా, శ్రీనివాస్‌రెడ్డి, పురోహితులు కిరణ్, తిరుమలరావు, జగదీశ్వర్, మల్లికార్జున్ పాల్గొన్నారు.
సమాచారం ఇవ్వాలి
తాండూరు రూరల్: సమాజంలో బాల్య వివాహాలను రూపుమాపాలని సాధన సచ్ఛంద సంస్థ జిల్లా కో–ఆర్డినేటర్ రమేశ్‌యాదవ్ సూచించారు. శనివారం మండలంలోని భూకై లాస్ దేవస్థానంలో బాల్య వివాహాలను అరికట్టాలని పూజారులతో ప్రతిజ్ఞ చేయించారు. బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే చైల్డ్‌లైన్ 1098, పోలీస్ 100కు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో సాధన సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
సాధన సచ్ఛంద సంస్థ జిల్లా కో–ఆర్డినేటర్ రమేశ్‌యాదవ్