
జర్నలిజానికి సంకెళ్లు.. ప్రమాదకరం
తాండూరు: ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర చాలా కీలకమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యు.రమేశ్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టులను రాజకీయ కక్షసాధింపులకు గురిచేయడం సమాజానికి మంచిది కాదన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడంతో పాటు ప్రభుత్వ లోటుపాట్లు తెలియజేసే జర్నలిజానికి సంకెళ్లు వేయాలనుకునే ధోరణి ప్రమాదకరమని తెలిపారు. ప్రభుత్వాలు.. పత్రికలు నిర్మాణాత్మక దృక్పథాన్ని కలిగి ఉండాలన్నారు. అప్పుడే ప్రజల్లో విశ్వసనీయత దక్కుతుందని స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులపై దాడులను ఎవరూ అంగీరించడం లేదన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్‌కుమార్