
మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి
అనంతగిరి: మహిళలు ఆత్మ విశ్వాసంతో వ్యాపారవేత్తలుగా ఎదగాలని అడిషనల్ కలెక్టర్ సుధీర్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వీ హబ్ ఆధ్వర్యంలో జిల్లా స్వయం సహాయక సంఘాలు, మహిళా పారిశ్రామికవేత్తలకు ఉమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రాంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. ఏటా బ్యాంకుల ద్వారా పెద్ద మొత్తంలో రుణాలు అందించడం జరుగుతోందన్నారు. వాటిని మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థిక ప్రగతి సాధించాలని సూచించారు. అనంతరం డీఆర్‌డీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీ్త్రనిధి కింద ఏటా రూ.610 కోట్ల రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. వీ హబ్ డైరెక్టర్ జాహిద్ షేక్ మాట్లాడుతూ.. టెక్స్‌టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, హస్తకళలు వంటి రంగాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో వీ హబ్ అసోసియేట్ డైరెక్టర్ శ్రీ ఊహ, పరిశ్రమల శాఖ జీఎం మహేశ్వర్, వీ హబ్ ప్రాజెక్ట్ మేనేజర్ తాజ్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సాయిరాం, అడిషనల్ డీఆర్‌డీఓ నర్సింలు, మెప్మా పీడీ రవికుమార్, డీపీఎం కొమరయ్య, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జానకి, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
అడిషనల్ కలెక్టర్ సుధీర్