
అయ్యా.. యూరియా
● ఎస్‌ఐ కాళ్లు మొక్కిన రైతు
● సోషల్ మీడియాలో వైరల్
కుల్కచర్ల: నెల రోజులుగా యూరియా అందక ఇబ్బంది పడుతున్నా పట్టించుకునే వారే లేరని రైతులు ఆందోళన చేపట్టారు. గురువారం మండల కేంద్రంలో పరిగి నియోజకవర్గ పరిరక్షణ సంఘం, అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో రైతు లు కుల్కచర్ల ప్రధాన చౌరస్తాలో నిరసన చేప ట్టారు. ఈ సందర్భంగా పీఎన్‌పీఎస్ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ.. రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని కోరారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వ్యవసాయాధికారులతో మాట్లాడారు. వారు శుక్రవారం రెండు లారీల యూరియా తెప్పిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఒక రైతు ఎస్‌ఐ రమేశ్ కాళ్లు మొక్కడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.