
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
అదనపు కలెక్టర్ లింగ్యానాయక్
అనంతగిరి: లైసెన్స్‌డ్ సర్వేయర్ల సప్లిమెంటరీ పరీక్షను సజావుగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ అధికారులకు సూచించారు. గురువారం ఆయన కల్టెరేట్‌లోని తన చాంబర్‌లో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లింగ్యానాయక్ మాట్లాడుతూ.. ఈ నెల 14వ తేదీన థియరీ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు, ప్లాటింగ్ ఎగ్జామ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని చెప్పారు. ఇందులో థియరీకి 76 మంది, ప్లాటింగ్‌కు 92 మంది అభ్యర్థులు హాజరవుతారన్నారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి ఎటువంటి కాపీయింగ్ లేకుండా చూసుకోవాలన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూసుకోవాలన్నారు. పరీక్ష కేంద్ర పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్‌కు సూచించారు. అత్యవసర మందులు, వైద్య సిబ్బందిని నియమించాలని డీఎంహెచ్‌ఓ లలితా దేవికి చెప్పారు. పరీక్ష కేంద్రం వద్దకు ఇతరులు ప్రవేశించకుండా పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రామిరెడ్డి, డీహెచ్‌ఎస్‌ఓ సత్తార్, జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం సి.రాజు పాల్గొన్నారు.