
‘పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో నాగేందర్‌గౌడ్’
అనంతగిరి: రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, విద్య, మౌలిక వసతుల కల్పన కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగేందర్‌గౌడ్ బరిలో ఉంటారని ఆయన కుమారుడు, రాష్ట్ర యువ నాయకుడు రాజేందర్ గౌడ్ అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం పార్టీ నాయకులతో కలిసి వికారాబాద్‌లోని అమరువీరుల స్తూపానికి ఘన నివాళి అర్పించారు. అనంతరం రాజేందర్‌గౌడ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేటి నుంచే ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఏడాదిన్నర కాలం ప్రతీ పట్టభద్రుడిని కలిసి వారి సమస్యలను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం తీసుకుంటున్నామన్నారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాగేందర్‌గౌడ్ తెలంగాణ ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నారని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ, శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి, రాములు, వెంకటేశ్, వెంకటేశ్‌గౌడ్, చందు, మహేందర్, శ్రీశైలం యాదవ్, మల్లేశం, నర్సింలు యాదవ్, విజయ్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.