
జంక్ ఫుడ్ తిని రోగాల బారిన పడొద్దు
పూడూరు: విద్యార్థులు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటారని డాక్టర్ మణికంఠరెడ్డి తెలిపారు. గురువారం మండల పరిధిలోని కంకల్ ప్రాథమిక పాఠశాలలో స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ పోషకాహార మాసం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోషకాహారం తీసుకుంటే మానసికంగా, శారీరకంగా ఎదుగుదల ఉండటంతో పాటు ఆరోగ్యంగా ఉంటారన్నారు. జంక్ ఫుడ్ తీసుకోవడం ద్వారా శరీరానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. మానవ శరీరానికి పోషకాహార ప్రాముఖ్యత అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం లక్ష్మణ్, ఉపాధ్యాయులు ఈశ్వరరావు, మస్తాన్‌బాబు, శ్రీదేవి పాల్గొన్నారు.