
అడవుల పరిరక్షణే ధ్యేయం
● జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్
● అమరులకు ఘన నివాళి
అనంతగిరి: అడవుల పరిరక్షణే ధ్యేయమని జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. గురువారం అటవీ శాఖ ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా వారు అమరులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వికారాబాద్‌లో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ నర్సరీల్లో మిగిలిన మొక్కల నిర్వహణ, సంరక్షణ గురించి చర్చించారు. వర్షాలు కురుస్తున్నందునా అవెన్యూ ప్లాంటేషన్‌కి అనువైన ప్రాంతాలను గుర్తించి ప్లాంటేషన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ రేంజ్ ఆఫీసర్ కే. శ్యాం కుమార్, రాజేందర్, శ్రీదేవి సరస్వతి, పరిగి రేంజ్ ప్రతిమ, కొడంగల్ రేంజ్ ఆఫీసర్ సవిత, తదితరులు పాల్గొన్నారు.