
నిల్వ ఉంచిన 34 సిలిండర్ల పట్టివేత
పహాడీషరీఫ్: స్థానిక పోలీస్‌స్టేషన్ పరిధిలో అ క్రమంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ ఉంచి బ్లాక్ మార్కెట్‌కు విక్రయిస్తున్న కేంద్రంపై మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుక్కుగూడలోని కావ్య ప్లాస్టిక్, స్టీల్ హౌస్‌లో పోలోడు గోవర్ధన్, మామిడిపల్లికి చెందిన రాజు, కాటేదాన్‌కు చెందిన అనిల్‌లు అక్రమంగా సిలిండర్లను నిల్వచేసి అవసరమైన వారికి రెట్టింపు ధరలో విక్రయిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి, వారి వద్ద నుంచి వివిధ పరిమాణాలకు సంబంధించిన 34 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.