
కెనరా బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ యాదగిరి
నవాబుపేట: కెనరా బ్యాంక్ సేవలను రైతులు, ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ యాదగిరి సూచించారు. బుధవారం మండలంలోని పులుమామిడి గ్రామంలో కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో గ్రామస్థాయి జన సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖాతాదారులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలన్నారు . ప్రధాన మంత్రి స్కిల్ జీవన జ్యోతి బీమా యోజన ద్వారా వార్షిక ప్రీమియం రూ.436 చెల్లించి రూ.2 లక్షల జీవిత బీమా రక్షణ పొందవచ్చని తెలిపారు. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన ద్వారా వారిక ప్రీమియం రూ.20తో రూ.2 లక్షల బీమా సదుపాయం అందుతుందని తెలిపారు. పంట రుణాలు, స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించడం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో కెనరా బ్యాంక్ డివిజనల్ మేనేజర్ శ్రీనాథ్ రెడ్డి, పులిమామిడి బ్రాంచ్ మేనేజర్ పవన్, పంచాయతీ కార్యదర్శి నితిన్, సిబ్బంది భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.