
విధి నిర్వహణలో అంకితభావం కీలకం
యాలాల: విధి నిర్వహణలో అంకితభావం ఎంతో కీలకమని ఎస్‌ఐ విఠల్‌రెడ్డి అన్నారు. యాలాల ఠాణాలో ఐదేళ్లుగా విధులు నిర్వహించి బుధవారం బదిలీపై వెళ్లిన కానిస్టేబుళ్లు వెంకటయ్య, అహ్మద్, నవీన్, నరేశ్‌ను ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్లుగా కానిస్టేబుళ్లు ఎంతో బాధ్యతతో విధులు నిర్వహించి, శాంతిభద్రతలు కాపాడారన్నారు. పోలీసు అధికారులు ఎక్కడున్నా.. అంకితభావంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. కానిస్టేబుళ్లతో పాటు ఇటీవల బదిలీపై వచ్చిన ఎస్‌ఐ– 2 సత్యనారాయణరాజు మరో పీఎస్‌కు బదిలీ కావడంతో ఆయనను సన్మానించారు.
ఎస్‌ఐ విఠల్‌రెడ్డి