
దురలవాట్లకు బానిస కావద్దు
ఎకై ్సజ్ సీఐ సదాశివుడు
మోమిన్‌పేట: యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లవద్దని సర్కిల్ ఎకై ్సజ్ సీఐ సదాశివుడు అన్నారు. స్థానిక ఎస్సీ కాలనీలో గంజాయి, మత్తుపదార్థాల వినియోగం, కలిగే నష్టాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దురలవాట్లకు లోను కావొద్దని సూచించారు. మత్తుకు బానిసగా మారితే శారీరక, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అనారోగ్యం పాలవుతారని పేర్కొన్నారు. సమాజం నుంచి చీత్కరించబడతారని హెచ్చరించారు. గంజాయి తదితర మత్తు పదార్థాలను విక్రయించినా, కొనుగోలు చేసినా శిక్ష తప్పదన్నారు. తల్లిదండ్రులు పిల్లలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు.