
తుది జాబితా విడుదల
దుద్యాల్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగా ఎంపీడీఓ మహేశ్ కుమార్ బుధవారం స్థానిక రాజకీయ నాయకులతో కలిసి తుది ఓటరు జాబితాను విడుదల చేశారు. మండల వ్యాప్తంగా 8 ఎంపీటీసీ స్థానాలు, ఒక జెడ్పీటీసీ స్థానానికి గాను 42 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేసినట్లు తెలిపారు. మండల వ్యాప్తంగా 21,078 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 10,830 మంది మహిళలు, 10,248 మంది పురుషులు ఉన్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీవో సత్యనారాయణ, సూపరింటెండెంట్ శ్రీనివాస్, కొడంగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకారం వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేరుగు వెంకటయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ ఖలీల్ పాషా, మాజీ సర్పంచ్ ఖాజా, కాంగ్రెస్ దుద్యాల్ గ్రామ అధ్యక్షుడు శ్రీశైలంగౌడ్, ఉపాధ్యక్షుడు కృష్ణ పాల్గొన్నారు.