
చేయూత పింఛన్లు పెంచాలి
అనంతగిరి: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వికలాంగులు, చేయూత పెన్షన్ దారుల పింఛన్లను ప్రభుత్వం వెంటనే పెంచాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు రామకృష్ణ, ప్రశాంత్ డిమాండ్ చేశారు. హామీ అమలు కోసం ఈ నెల 15న అన్ని తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ఽమహాధర్నా చేపట్టనున్నామని పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్‌లో సమితి జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున ఆధ్వర్యంలో ఎంఎస్పీ, వికలాంగుల హక్కుల పోరాట సమితి, చేయూత పింఛన్ దారుల హక్కుల పోరాట సమితి ముఖ్య ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు రవికుమార్, కిష్టన్న, ఏసు, పుష్పరాణి, సునీత, పద్మమ్మ, సుశీల, ఇందిరమ్మ తదితరులు పాల్గొన్నారు.