
రాజీతో కేసుల పరిష్కారం
మోమిన్‌పేట: రాజీతో ఎలాంటి కేసులకై నా సులువుగా పరిష్కారం మార్గం లభిస్తుందని సీఐ వెంకట్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 13న జాతీయ లోక్ అదాలత్ జరగనుందని, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సివిల్, మోటారు వాహనాల ప్రమాదాలు, కుటుంబ వివాదాలు, క్రిమినల్ కేసులు తదితర వాటిని పరస్పర అంగీకారంతో కోర్టు కేసులను అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని, సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవాలన్నారు.
పూడూరులో..
పూడూరు: పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులు లోక్ అదాలత్‌ల ద్వారా పరిష్కరించుకోవాలని చన్గోముల్ ఎస్‌ఐ భరత్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 13న జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అదాలత్ నిర్వహించనున్నారని పేర్కొన్నారు. కక్షిదారులు కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
అనంతగిరిలో..
అనంతగిరి: రాజీయే రాజమార్గమని సీఐ భీమ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13న జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్‌లో కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను సామరస్యంగా, సత్వరంగా పరిష్కరించుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం పోలీస్ అధికారులను సంప్రదించాలన్నారు.
యాలాలలో..
యాలాల: రాజీయే రాజమార్గమని యాలాల ఎస్‌ఐ విఠల్‌రెడ్డి అన్నారు. శనివారం జాతీయ లోక్ అదాలత్ జరగనుందని, కక్షిదారులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారని, పెండింగ్ కేసులు, పరస్పర ఒప్పందం ద్వారా త్వరితగతిన పరిష్కరిస్తారని తెలిపారు.
● సీఐ వెంకట్
● 13న జాతీయ లోక్ అదాలత్