
విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
కొడంగల్ రూరల్: వ్యాసరచన పోటీలతో విద్యార్థుల్లో వ్యక్తీకరణ, లేఖన నైపుణ్యాలు మెరుగుపడతాయని ప్రిన్సిపాల్ డాక్టర్ బి.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శ్రీసత్యసాయి సేవా సమితి సౌజన్యం, కళాశాల ఐక్యూఏసీ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు ‘‘వర్తమానంలో మన నడవడి మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది’’ అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పోటీల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ రచనకు బంగారు పథకం అందజేస్తారని ప్రిన్సిపాల్ తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ టి.రాంబాబు, అధ్యాపకులు బంటు నర్సింలు, టి.రమేశ్, విద్యార్థులు పాల్గొన్నారు.