తెగుతున్న బంధాలు
ఆందోళన కలిగిస్తున్న కుటుంబ హత్యలు వికారాబాద్: అగ్ని సాక్షిగా ఏడడుగులు నడిచి మూడుముళ్ల బంధంతో ఒక్కటైన కొంతమంది ఒకరి పాలిట మరొకరు యమ పాశం విసురుకుంటున్నారు. ప్రియురాలి మోజులో భార్యను భర్త.. ప్రియుడి కోసం భర్తను భార్య.. ఆస్తిపై ఆశతో తండ్రిని కొడుకు కడతేర్చుతున్నారు. వావివరసలు మరచి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన కొడుకులు, మనుమలు పండుటాకుల ప్రాణం తీస్తున్నారు. ఇటీవల ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని మోమిన్‌పేట, కోట్‌పల్లి, తాండూరు, వికారాబాద్, మొయినాబాద్ తదితర మండలాల్లో జరిగిన అమానవీయ ఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పోలీసులు కేసులతో సరిపెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. నైతిక విలువలు పెంపొందించే దిశగా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలీసు శాఖ ఆధ్వర్యంలో సామాజిక రుగ్మతలను రూపుమాపే దిశగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పలువురు సూచిస్తున్నారు.
మొదటి భర్తతో కలిసి..
బిహార్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ మొదటి భర్తను వదిలేసి రెండో భర్తతో కలిసి తెలంగాణకు వచ్చింది. మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్ సమీపంలోని ఓ డెయిరీ ఫాంలో పనిచేసుకుంటున్నారు. ఇటీవల రెండో భర్తతో కూడా గొడవ పడింది. ఈ క్రమంలో మొదటి భర్తకు ఫోన్ చేసి ఇక్కడికి పిలిపించుకుంది. అతన్ని అంతమొందిస్తే మళ్లీ మనం కలిసి ఉండొచ్చని నమ్మబలికింది. ఇద్దరూ కలిసి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు.
సీన్ రివర్స్
ఒకప్పుడు వరక్నపు వేధింపులు, వివాహేతర సంబంధాల కారణంగా భార్యను భర్త, అత్తింటి వారు కడతేర్చిన ఘటనలు చూశాం. ఇటీవల కాలంలో సీన్ రివర్స్ అయ్యిందనిపిస్తోంది. భార్యలే భర్తలను అంతమొందిస్తున్న ఘటనలు వెలుగుచేస్తున్నాయి. రెండు నెలల వ్యవధిలోనే ఇలాంటి ఘటనలు జిల్లాలో మూడు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
● రెండు నెలల క్రితం తాండూరు మండలం మల్కాపూర్‌లో భార్య భర్తను హత్య చేసింది. కూతురికి తండ్రి కూడా సహకరించాడు. ఇద్దరూ కటకటాలపాలయ్యారు. వారి ఇద్దరు పిల్లలు అనాధలుగా మారారు.
● వారం రోజుల క్రితం ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. బంట్వారం మండలం కొంపల్లికి చెందిన దంపతులు మోమిన్‌పేట మండలం కేసారం గ్రామ శివారులోని ఓ ప్రైవేటు వెంచర్‌లో కూలి పనులు చేసుకుంటూ అక్కడే ఉంటున్నారు. గత ఆదివారం రాత్రి భర్తతో గొడవ పడి బండరాయితో తలపై మోది హతమార్చింది.
● తాజాగా రెండు రోజుల క్రితం ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. కోట్‌పల్లి మండలం రాంపూర్‌కు చెందిన ఓ మహిళ భర్తతో తరచూ గొడవ పడేది. ఈ గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లిపోదామని పంచాయతీ పెట్టేది. భర్త ససేమిరా అనడంతో గత గురువారం రాత్రి పడుకున్న చోటే బండరాయితో తలపై మోది అంతమొందించింది. ఆమెకు ఎవరైనా సహకరించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో వారి ఇద్దరు కూతుళ్లు అనాధలయ్యారు.
వికారాబాద్ మండలం కామారెడ్డిగూడకు చెందిన డ్రైవింగ్ వృత్తిలో ఉన్న యువకుడు ఏడాది క్రితం అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఆరు నెలలు తిరగక ముందే వరకట్న వేధింపులకు పాల్పడుతూ వచ్చాడు. హైదరాబాద్ బోడుప్పల్‌లో నివాసముంటున్న అతను గర్భంతో ఉన్న భార్యను కనికరం లేకుండా అంతమొందించాడు. అంతటితో ఆగకుండా ముక్కలుగా నరికాడు. మొండెం నుంచి తల, శరీర భాగాలను వేరు చేసి మూసీలో పడేశాడు. 15 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది.
ఒకరినొకరు కడతేర్చుకుంటున్న వైనం అక్రమ సంబంధాలు, ఆస్తి గొడవలే కారణం అనాథలవుతున్న పిల్లలు ఆందోళన కలిగిస్తున్న ఘటనలు
ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న ఘటనలు ఆందో ళన కలిగిస్తున్నాయి. రోజురోజుకూ విలువలు తగ్గిపోతున్నాయి. ఇలాంటి ఘటనలను అరికట్టాలంటే విలువలతో కూడిన సమాజ నిర్మాణం అవసరం. పాఠశాల స్థాయి నుంచే మంచి సమాజం కోసం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.
– డాక్టర్ భాస్కరయోగి, రచయిత
ఆందోళన కలిగిస్తున్న కుటుంబ హత్యలు
భార్యను కడతేర్చి ముక్కలుగా నరికి..
11 గుంటల భూమి కోసం అన్నదమ్ముల కొట్లాట
ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని దండుమైలారంలో 11 గుంటల భూమి కోసం అన్నదమ్ముల మధ్య జరిగిన కొట్లాటలో ఒకరు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆగస్టు 31న చోటు చేసుకుంది.
రోజురోజుకూ నేర ప్రవృత్తి పెరిగిపోతోంది.. మానవ సంబంధాలు మంటగలిసి పోతున్నాయి.. అనుమానాలు.. అక్రమ సంబంధాలు.. ఆస్తి తగాదాలతో అయినవారని కూడా చూడకుండా అంతమొందించడం ఆందోళన కలిగిస్తోంది.
విలువలు అవసరం
1/1
తెగుతున్న బంధాలు