
పీజీ ప్రవేశ పరీక్షలో విద్యార్థుల సత్తా
కొడంగల్ రూరల్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు పీజీ ప్రవేశ పరీక్షలో ప్రతిభ చాటడం గర్వకారణంగా ఉందని ప్రిన్సిపాల్ డాక్టర్ బి.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. విద్యార్థుల కృషి, పట్టుదలతో ఉన్నత విద్యలో ముందుకు సాగడం విశేషమన్నారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. యూనివర్సిటీ స్థాయిలో కె.అనిల్ ఫిజిక్స్‌లో 69వ ర్యాంకు, కె.జగదీష్ ఎంఏ తెలుగు 14వ ర్యాంకు, కె.రమేష్ సెంట్రల్ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగంలో సీటు సాధించారన్నారు. అనిల్ మ్యాథమెటిక్స్‌లో, స్వాతి, అశ్విని, కుమారి, ప్రమీళ కెమిస్ట్రీలో మంచి ర్యాంకులు సాధించారని తెలిపారు.