‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి.. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి.. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని ధిక్కార స్వరాన్ని వినిపించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో మంగళవారం తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని కాళోజీ చిత్రపటాలకు నాయకులు, అధికారులు, మేధావులు, సంఘ సంస్కర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు నివాళులర్పించారు. తెలంగాణ పోరాటంలో కాళోజీ రచనలు స్ఫూర్తి నింపాయని వక్తలు పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు అవిరల కృషి చేశారన్నారు.
కాళోజీ రచనలు స్ఫూర్తిదాయకం
కాళోజీ రచనలు స్ఫూర్తిదాయకం
కాళోజీ రచనలు స్ఫూర్తిదాయకం
కాళోజీ రచనలు స్ఫూర్తిదాయకం
కాళోజీ రచనలు స్ఫూర్తిదాయకం
కాళోజీ రచనలు స్ఫూర్తిదాయకం
కాళోజీ రచనలు స్ఫూర్తిదాయకం