
శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి
పూడూరు: వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు పాటించి పంటలను కాపాడుకోవాలని రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ రాజేశ్వర్‌రెడ్డి రైతులకు సూచించారు. మంగళవారం మండలంలోని మేడికొండ గ్రామంలో పత్తి, బంతి, చేమంతి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏరువాక శాస్త్రవేత్తలు మధుకర్, జిల్లా వ్యవసాయ అధికారి రాజరత్నం, ఏడీఏ లక్ష్మీకుమారి పంటల సాగుపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి తులసీరాం, ఉద్యాన వన అధికారి సురేంద్రనాథ్, ఏఈఓ ఇలియాస్, రైతులు అనంత్‌రెడ్డి, యాదయ్య, రాంరెడ్డి, నర్సింలు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.