
ఖోఖోలో సత్తాచాటిన విద్యార్థులు
కొడంగల్ రూరల్: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం 69వ ఎస్‌జీఎఫ్(స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ఖోఖో పోటీలు నిర్వహించా రు. కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట, దుద్యా ల్ మండలాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. అండర్ –17 బాలుర విభాగం ఖోఖో పోటీల్లో ఎంజేపీ(మహాత్మా జ్యోతి బాపులే) గురుకుల పాఠశాల కొడంగల్ జట్టు విజేతగా నిలిచింది. సాంఘిక సంక్షే మ శాఖ గురుకుల పాఠశాలు జట్టు కొడంగల్ రన్న ర్‌గా నిలిచింది. అండర్ – 17 బాలికల విభాగంలో ఎంజేపీ గురుకు పాఠశాల బూరాన్‌పూర్ జట్టు విజేతగా, జెడ్పీహెచ్‌ఎస్ బాలంపేట జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. అండర్ – 14 బాలికల విభాగంలో జెడ్పీహెచ్‌ఎస్ గోకఫస్లాబాద్ జట్టు విజేత గా..జెడ్పీహెచ్‌ఎస్ దుద్యాల్ జట్టు రన్నర్‌గా నిలిచింది. అండర్–14 బాలుర విభాగంలో ఎంజేపీ గురు కుల పాఠశాల కొడంగల్ జట్టు విన్నర్‌గా, ఎంజేపీ దౌల్తాబాద్ జట్టు రన్నర్‌గా నిలిచినట్లు ఎస్‌జీఎఫ్ ఆర్గనైజర్ అజీజ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ము ఖ్య అతిథులుగా ఎంఈఓ రాంరెడ్డి,ఎస్‌ఐ జీవీ సత్య నారాయణ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ పట్వారి జనార్దన్, ఆయా పాఠశాలల పీఈటీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.