
వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
షాద్‌నగర్: వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షు డు టంగుటూరి నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం షాద్‌నగర్ ఆర్‌డీఓ సరితను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల హా మీని నెరవేర్చాలని అన్నారు. రైతులకు కావాల్సి న యూరియాను వెంటనే పంపిణీ చేయాలని డి మాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్య క్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు బుద్దుల జంగయ్య, రమేష్ యాదవ్, దామోదర్‌రెడ్డి,వెంకటయ్య,షేక్ ఉస్మాన్, కిష్టయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.