సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఉషారాణి | - | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఉషారాణి

Sep 9 2025 12:58 PM | Updated on Sep 9 2025 12:58 PM

సీఎం రేవంత్‌రెడ్డిని  కలిసిన ఉషారాణి

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఉషారాణి

కొడంగల్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కొడంగల్‌ మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్‌ పర్సన్‌ ఉషారాణి దంపతులు సోమవారం కలిశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి కొడంగల్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. కార్యక్రమంలో మిఠాయి రాజు, డాక్టర్‌ సాకేత్‌, డాక్టర్‌ శ్రావణి తదితరులు ఉన్నారు.

వసతి గృహాల పరిశీలన

కొడంగల్‌: పట్టణంలోని ఎస్సీ, బీసీ బాలికల వసతి గృహాలు, ఎస్టీ బాలుర వసతి గృహాలను సోమవారం ట్రైనీ కలెక్టర్‌ హర్ష్‌ చౌదరి సందర్శించారు. వాటిలో వసతులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. భోజనం, మెనూ అమలు, నోటుపుస్తకాలు, యూనిఫాం తదితర వాటి గురించి ఆరా తీశారు. విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను వివరించారు. స్టోర్‌ రూం, కిచెన్‌, హాస్టల్‌ పరిసరాలను తిరిగి చూశారు. విద్యార్థులకు అవసరమైన వసతుల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో ఏఎస్‌సీడీఓ పాండు, వార్డెన్లు వరలక్ష్మీ, నిర్మల, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

మహిళల ఆరోగ్య

పరిరక్షణకు చర్యలు

డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ లలితాదేవి

అనంతగిరి: దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 2వ తేదీ వరకు నిర్వహించే స్వస్త్‌ నారీ స్వశక్త్‌ పరివార్‌ అభియాన్‌ (అతివ ఆరోగ్య మస్తు) కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేద్దామని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ లలితా దేవి అన్నారు. సోమవారం వికారాబాద్‌లోని జిల్లా కార్యాలయం నుంచి అన్ని పీహెచ్‌సీల వైద్యులు, ఎంఎల్‌హెచ్‌పీలతో జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సెప్టెంబర్‌ 17 నుంచి మహిళలకు అన్ని రకాల వైద్య సేవలు అందించడం జరుగు తుందన్నారు. అలాగే రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రవీంద్ర యాదవ్‌, ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ పవిత్ర, డాక్టర్‌ బీబీ జానీ, డాక్టర్‌ బుచ్చిబాబు, డాక్టర్‌ గోపాల్‌, డిప్యూటీ డెమో శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ట్రేడ్‌ లైసెన్స్‌ తప్పనిసరి

అనంతగిరి: వికారాబాద్‌ పట్టణంలోని దుకాణాదారులంతా తప్పకుండా ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకోవాలని మున్సిపల్‌ అధికారులు తెలిపారు. కమిషనర్‌ ఆదేశాల మేరకు సోమవారం ట్రేడ్‌ లైసెన్స్‌లు తీసుకోని పలు దుకాణాలను సీజ్‌ చేశారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఏసుదాసు జవాన్లతో కలిసి దుకాణాలను తనిఖీ చేశారు. ప్రతి ఒక్కరూ లైసెన్సులు తీసుకుని మున్సిపల్‌ అభివృద్ధికి దోహదపడా లని వారు సూచించారు. కార్యక్రమంలో ఎన్వి రాల్‌మెంట్‌ ఇంజనీర్‌ శ్రీనివాస్‌, మున్సిపల్‌ జవాన్లు ఆశయ్య, వినోద్‌, బాబా, రాజు, శంకర్‌, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement