
స్థానిక ఎన్నికలకు సహకరించాలి
అనంతగిరి: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని అదనపు కలెక్టర్ సుధీర్ కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో ఓటరు లీస్ట్, పోలింగ్ కేంద్రాల జాబితాపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలకు సంబంధించి ఆయా గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితా సిద్ధంగా ఉందన్నారు. పోలింగ్ బూత్‌లపై అభ్యంతరా లు ఉంటే తెలియజేయాలని సూచించారు. జి ల్లాలోని 594 గ్రామ పంచాయతీల్లో 5,058 పో లింగ్ కేంద్రాలను ఎంపిక చేసినట్లు వివరించారు. 6,98,478 ఓటర్లు ఉన్నారని, ఇందులో 3,43,672 మంది పురుషులు, 3,54,790 మంది మహిళలు, 16 మంది ఇతర ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో డీపీఓ జయసుధ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ సుధీర్