అనంతగిరి: భూ భారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి అన్ని మండలాల తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో చాలా మంది రైతులు భూ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకున్నారని వాటిని పూర్తి స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌ఓ మంగ్లీలాల్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, ఆర్‌డీఓ వాసుచంద్ర తదితరులు పాల్గొన్నారు.
సమయపాలన పాటించాలి
ప్రజావాణి అర్జీలను సత్వరం పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 83మంది వివిధ సమస్యల పరిష్కా రం కోసం దరఖాస్తులు ఇచ్చారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించకుండా మండల ప్రత్యేక అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించాలని సూచించారు. డెంగీ, మలేరియా జ్వరాలు ప్రబల కుండా చూడాలన్నారు. కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పని సరిగా హాజరు కావాలని, అత్యవసర పరిస్థితుల్లో ఎక్కిడికై నా వెళ్లాల్సి వస్తే అనుమతి తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హర్ష్‌చౌదరి, డీఆర్‌ఓ మంగ్లీ లాల్, ఆర్‌డీఓ వాసు చంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్