
యూరియా కావాలంటే!
కావాల్సినంత యూరియా దొరకక తిప్పలు పడుతున్న అన్నదాతలకు ఫర్టిలైజర్ షాపుల యజమానుల షరతులు పెనుభారంగా మారుతున్నాయి. యూరియా కోసం తప్పనిసరిగా బయో, లాప గుళికలు కొనాలని ఒత్తిడి తేవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దుద్యాల్: ఓ వైపు రైతుకు సరిపడా యూరియా అందక విలవిలలాడుతుంటే.. కొందరు వ్యాపారులు వారి అవసరాలను ఆసరాగా చేసుకుని ఇష్టారీతిన వ్యాపారం చేస్తున్నారు. ప్రస్తుతం వరి, పత్తి, మొక్కజొన్న పంటకు యూరియా, డీఏపీ ఎరువులు అందించాల్సి ఉంది. ఇదే అదనుగా భావించిన ఫర్టిలైజర్ షాపుల యజమానులు యూరియా కావాలంటే బయో ఉత్పత్తులు, లాప గుళికలు, క్రిమి సంహారక మందులు కొనాలని షరతులు పెడుతున్నారు. ఇదే విషయాన్ని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ ఫర్జిలైజర్ షాప్‌లు, మన గ్రోమోర్‌లు, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలల్లో ఎరువులు, క్రిమి సంహారక మందులు అందుబాటులో ఉంటున్నాయి. కొంత మంది ప్రైవేట్ వ్యక్తులు సైతం గుట్టు చప్పుడు కాకుండా వ్యాపారాలు చేసుకుంటున్నారు.
సరఫరా ఇలా..
ప్రభుత్వం ప్రైవేట్ ఫర్జిలైజర్, ప్రభుత్వ అనుసంధాన ఫర్జిలైజర్ దుకాణాలకు విరివిగా అందిస్తుంది. ప్రభుత్వం అనుసంధాన షాపులైన ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలు,(డీసీఎంఎస్, పీఏసీఎస్, ఎఫ్‌ఏసీఎస్, హాకా) సోసైటీలకు 60 శాతం యూరియా సరఫరా కాగా మిగిలిన 40 శాతం ప్రైవేట్ షాపులకు సరఫరా చేస్తారు.
బయో, లాప గుళికలు కొనాలని షరతు
కొరతను ఆసరా చేసుకొని వ్యాపారుల ఆగడాలు
రైతులపై అదనపు భారం మోపుతున్న వైనం
లబోదిబోమంటున్న అన్నదాతలు
పట్టించుకోని అధికారులు
జిల్లా వ్యాప్తంగా 324 దుకాణాలు
జిల్లాలో దుకాణల వివరాలు
ఆగ్రోస్ రైతు సేవాకేంద్రాలు 24
డీసీఎంఎస్ 26
పీఏసీఎస్ 14
ఎఫ్‌ఏసీఎస్ 01
హెచ్‌ఏసీఏ(హాకా) 01
మన గ్రోమోర్ 08
ప్రైవేట్ ఫర్జిలైజర్స్ 245
చర్యలు తీసుకుంటాం
ఎరువులు, క్రిమిసంహారక మ ందులు అమ్ముతున్న ఏ యా జమాన్యమైన యూ రియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులతో పాటు బయో ఉత్పత్తులు, లాప గుళికలు తప్పనిసరిగా అంటగట్టొద్దు. తమకు ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. నిజమని తేలితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రైతులకు కావాల్సిన ఎరువులను సరైన ధరకే అమ్మాలి.
– రాజారత్నం, జిల్లా వ్యవసాయ అధికారి

యూరియా కావాలంటే!