
ఆన్‌లైన్ పనులు అప్పగించొద్దు
బొంరాస్‌పేట: ఆన్‌లైన్ పనులు అదనపు భారంగా మరుతుందని ఏఎన్‌ఎంలను మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. కొంత కాలంగా ఎన్‌సీడీ ప్రోగ్రామ్‌లో ఏఎన్‌ఎంలతో స్క్రీనింగ్ టెస్టులతోపాటు ఆప్‌లైన్ రిపోర్టులు చేయిస్తున్నారు. తాజాగా ఆన్‌లైన్ కూడా చేయాలని ఒత్తిడి పెంచడం సమంజసం కాదన్నారు. పని ఒత్తిడి కారణంగా మానసిక, శారీరక రుగ్మతలకు గురౌతున్నామని వాపోయారు. క్షేత్రస్థాయి పనులతోపాటు ఆన్‌లైన్ పనులు చేయలేమంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు ఎన్‌సీడీ ప్రోగ్రామ్‌లో ఆన్‌లైన్ పనులకు ఏఎన్‌ఎంలను మినహాయించాలని కోరారు. ఇందులో తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఎన్‌ఎంలు లీలావతి, హైమావతి, అంజలి, శ్రీలత, పుష్పలత, పద్మ, రాములమ్మ తదితరులు వైద్యాధికారి హేమంత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.
పీహెచ్‌సీ ఎదుట బైఠాయించిన ఏఎన్‌ఎంలు