మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌కు మరమ్మతులు | - | Sakshi
Sakshi News home page

మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌కు మరమ్మతులు

Sep 9 2025 12:56 PM | Updated on Sep 9 2025 12:56 PM

మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌కు మరమ్మతులు

మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌కు మరమ్మతులు

దుద్యాల్‌: మండల పరిధిలోని హస్నాబాద్‌, ఆలేడ్‌ గ్రామాలకు సరఫరా అయ్యే మిషన్‌ భగీరథఽ పైపులైన్‌ పగిలిపోవడంతో నీటి సరఫరా నిలిచిపోంది. దీంతో ఐదు రోజుల పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై సాక్షిలో ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు సోమవారం పైప్‌లైన్‌ లీకేజీని సరిచేశారు. మిషన్‌ భగీరథ ఏఈఈ హర్షిత్‌రెడ్డి, సిబ్బందితో వచ్చి సమస్యను పరిష్కరించారు. దీంతో ఆయా జీపీలకు యథావిధిగా నీటి సరఫరా పునఃప్రారంభమైంది.

టీహెచ్‌ కాలేజీపై చర్యలు తీసుకోండి

తాండూరు టౌన్‌: పట్టణంలో ఎలాంటి అను మతి లేకుండా కొనసాగుతున్న టీహెచ్‌ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో సంఘం నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియేట్‌ నుంచి ఎలాంటి పర్మిషన్‌ లేకుండా ఇంటర్‌ తరగతులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అడ్మిషన్లు తీసు కుని విద్యార్థులు, తల్లిదండ్రులను మోసగిస్తున్న కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయమై పలుమార్లు జిల్లా నోడల్‌ అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోదన్నారు. ఆయన వెంట సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌ తదితరులు ఉన్నారు.

భార్యను వేధించిన భర్తకు జైలు

అనంతగిరి: భార్యను వేధించిన భర్తకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ కొడంగల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ శ్రీరాం తీర్పు వెల్లడించారని మహిళా పీఎస్‌ సీఐ బి.సరోజ తెలిపిన వివరాల ప్రకారం.. లగచర్ల గ్రామానికి చెందిన చౌదర్‌పల్లి సుజాత అదనపు వరకట్నం కోసం వేధిస్తున్నారని 2019 ఆగస్టు 10న భర్త, అత్తమామలపై ఫిర్యాదు చేసింది. వీరికి పలుమార్లు కౌన్సెలింగ్‌ నిర్వహించిన ఎస్‌ఐ శ్రీకాంత్‌, అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చార్జ్‌షీట్‌ దాఖలు చేయడంతో పరిశీలించిన న్యాయమూర్తి పైతీర్పు వెల్లడించారు. నేరస్తునికి శిక్ష పడేలా చూసిన కోర్టు డ్యూటీ ఆఫీసర్‌ రామకృష్ణను సీఐ సరోజ అభినందించారు.

మాజీ మంత్రి మాణిక్‌రావుకు నివాళి

తాండూరు: తాండూరు ప్రాంత కీర్తి ప్రతిష్టల ను జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఘనత మాజీ మంత్రి మాణిక్‌రావుకు దక్కుతోందని రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యుడు రమేశ్‌ మహరాజ్‌ అన్నారు. సోమవారం పట్టణంలోని మల్లప్ప మడిగె వద్ద ఉన్న మాణిక్‌రావు విగ్రహానికి ఆయన వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరోవైపు మాణిక్‌రావు సతీమణి శశిప్రభ, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ తాటికొండ స్వప్నపరిమళ్‌, మాజీ మంత్రి చిన్నారెడ్డి, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ లక్ష్మారెడ్డి, బీసీ కమీషన్‌ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్‌ సైతం వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

అనంతగిరి: మూడు రోజు ల క్రితం తప్పిపోయిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన వికారాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిఽధిలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. బొంరాస్‌పేట మండలం మెట్లకుంటకు చెందిన ఎస్‌.మనోజ్‌(32)కు భార్య రమాదేవి, ఓ బాలుడి ఉన్నాడు. ఈ నెల 4న మనోజ్‌ వికారాబాద్‌ పట్టణంలో శుభకార్యానికి హాజరై బయటకు వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదు. దీంతో భార్య మరుసటి రోజు వికారాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా ఆదివారం రాత్రి ఆలంపల్లి సమీపంలోని రైలు పట్టాల పక్కన మనోజ్‌ మృతదేహం పోలీసులు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

వివరాలు వెల్లడిస్తున్న సీఐ సరోజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement