
శోభాయమానంగా గిరి ప్రదక్షిణ
దోమ: వీరభద్రేశ్వర ఆలయంలో ప్రదక్షిణ
కుల్కచర్ల: గిరిప్రదక్షిణ చేస్తున్న భక్తులు
కుల్కచర్ల: పౌర్ణమి సందర్భంగా ఆదివారం పాంబండ రామలింగేశ్వరాలయంలో గిరిప్రదక్షిణ నిర్వహించారు. ఉదయం 6 గంటలకు రుద్రహోమం నిర్వహించి అనంతరం గిరిప్రదక్షిణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మహిపాల్ రెడ్డి, కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, అర్చకులు పాండు శర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
వీరభద్రేశ్వర స్వామికి రుద్రాభిషేకం
దోమ: మండల పరిధిలోని గూడూరులో ఆదివారం గ్రామస్తులు వీరభద్రేశ్వర స్వామికి పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకుడు జంగం శివ ఆధ్వర్యంలో స్వామి వారికి రుద్రాభిషేకం చేశారు. అనంతరం ఆలయం చూట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు శేరి రాంరెడ్డి, శివకుమార్, కృష్ణారెడ్డి, ఆంజనేయులు, శ్రీనివాస్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, సాయిరెడ్డి, మహేందర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, సతీశ్ కుమార్, ఆనంద్ కుమార్, బుగ్గారెడ్డి, ప్రసాద్‌కుమార్, భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.

శోభాయమానంగా గిరి ప్రదక్షిణ