
నిలిచిన మిషన్ భగీరథ నీటి సరఫరా
దుద్యాల్: మండల పరిధిలోని ఆలేడ్, హస్నాబాద్ గ్రామాల్లో తాగునీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐదు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా కాకపోవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. హస్నాబాద్ గ్రామ సమీపంలో పైపులైన్ పగిలిపోవడంతో ఈ సమస్య ఏర్పడిందని చెబుతున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా మరమ్మతులు చేయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో రెండు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. దీంతో గ్రామంలోని కొందరు ప్రైవేట్ బోర్లు, సమీప బావుల నుంచి తెచ్చుకుంటున్నట్లు చెబుతున్నారు. కనీసం అధికారులు తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయించడం లేదని వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి పగిలినపైపులైన్‌ను మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.
ఐదు రోజులుగా ఇబ్బందులు
ప్రైవేట్ బోర్ల నుంచి
తెచ్చుకుంటున్న ప్రజలు
ఇబ్బందులు ఎదుర్కొంటున్న
హస్నాబాద్, ఆలేడ్ గ్రామస్తులు
పట్టించుకోని అధికారులు