
పాత అలైన్‌మెంట్‌నే పాటించండి
పూడూరు: ట్రిపుల్ ఆర్ పరిధిలో భూములు కోల్పోతున్న బాధితులు ఆదివారం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితులు మాట్లాడుతూ ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్చడంతో మండల కేంద్రంలోని 60 మంది రైతులు భూములు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ భూములపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నామన్నారు. పాత అలైన్‌మెంట్ ప్రకారమే ట్రిపుల్ ఆర్ నిర్మించాలని కోరారు. భూములు ఇచ్చేది లేదని.. ఎంతవరకై నా పోరాడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
నూతన జేఏసీ ఏర్పాటు
ట్రిపుల్ ఆర్ భూ బాధితుల జేఏసీ కన్వీనర్‌గా పి.వెంకట్‌రెడ్డి, కోకన్వీనర్లుగా నవీన్ జ్యోషి, మైబెల్లి, సభ్యులుగా సాయిరెడ్డి, శర్బలింగం, నవాజ్, గౌరేశం, అమర్‌నాథ్, జబ్బార్, మున్నీర్, సాధకాలిను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ మాజీ చైర్మెన్లు నరసింహారెడ్డి, రఘునాథ్ రెడ్డి, నాయకులు తాజుద్దీన్, మల్లేశం, శ్యాంసుందర్ రెడ్డి, సతీశ్ పంతులు, రామచంద్రయ్య హరీశ్వర్ రెడ్డి, నజీర్ తదితరులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి భూ నిర్వాసితుల నిరసన