
‘స్థానికం’గా సత్తా చాటుదాం
● ప్రతీ గ్రామం నుంచి బీజేపీ అభ్యర్థులు పోటీ చేయాలి
● పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి
మర్పల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీ గ్రామం నుంచి బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉండాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన పార్టీ మండల అధ్యక్షుడు రామేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన సిరిపురంలో ఏర్పాటు చేసిన పార్టీ శ్రేణుల సమావేశానికి హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణ రూపొందించారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ను నమ్మే స్థితిలో లేరన్నారు. రిజర్వేషన్లను దృష్టిలో ఉంచుకుని పోటీకి ఆసక్తి ఉన్న ఆశావహుల వివరాలు సేకరించారు. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా సమష్టిగా అభ్యర్థిని గెలిపించుకోవాలని సూచించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్నవారి వివరాలు, బయోడేటా తీసుకున్నారు. ఈ వివరాలను పార్టీ అధిష్టానానికి పంపుతామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా కోఆర్డినేటర్ రాములు, జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, జిల్లా మాజీ కార్యదర్శి బలరాంగౌడ్, నాగన్న, మండల కోఆర్డినేటర్ యాదవరెడ్డి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీమంత్‌కుమార్, నాయకులు జైపాల్, మహేశ్వరి, సునిల్, రమేశ్, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, సుభాశ్ తదితరులు ఉన్నారు. అనంతరం పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.