
ఘనంగా అనంత వ్రతాలు
అనంతగిరి: వికారాబాద్ పట్టణ సమీపంలోని అనంతగిరి గుట్టపై వెలసిన శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయంలో అనంత చతుర్దశిని పురస్కరించుకుని శనివారం అనంత వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఒక్కసారి ఈ వ్రతం ఆచరిస్తే 14 ఏళ్ల పాటు చేయాల్సి ఉంటుందని అర్చకులు తెలిపారు. ఆయా జిల్లాలు, కర్ణాటక నుంచి వ్రతం ఆచరించే వారు ఉదయం 9గంటలకే ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. 185 జంటలు వ్రతం ఆచరించారు. అనంతరం స్వామివారికి కల్యాణం జరిపించారు. ప్రత్యేక హారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అన్నదానం నిర్వహించారు. వేడుకల్లో ఆలయ ట్రస్టీ పద్మనాభం, ఈవో నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు