
ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు
కొడంగల్ రూరల్: పట్టణ శివారులోని సిద్దనొంపు పడమటి ఆంజనేయస్వామికి శనివారం హిందూవాహిని ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 102వ శనివారాన్ని పురష్కరించుకొని సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు.
డ్రాఫ్ట్ ఓటరు జాబితా ప్రదర్శన
అనంతగిరి: జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాను శనివారం వికారాబాద్ జెడ్పీ కార్యాలయంలో ప్రదర్శించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మండల స్థాయిలో ఎంపీడీఓలు వారివారి మండలాల్లో ఓటరు, పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రదర్శించారు.
సరళారెడ్డికి బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డు
యాలాల: మండలంలోని జక్కేపల్లి సమీపంలో గల ఆర్‌బీఓఎల్(రాడికల్ బయో ఆర్గానిక్స్ లిమిటెడ్) ఎండీ బుయ్యని సరళారెడ్డి బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డు అందుకున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన బిజినెస్ అవార్డ్స్ – 2025 కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ జాటోత్ రాంచందర్ నాయక్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల వ్యాపార రంగంలో విశిష్ట కృషి, నూతన ఆవిష్కరణలు, సమాజానికి అందిస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డును అందిస్తుంటారు. సరళారెడ్డికి అవా ర్డు రావడంపై తాండూరు ప్రాంత నాయకులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.
అంబేడ్కర్ భవన నిర్మాణ పనులు ప్రారంభించండి
కేవీపీఎస్ ప్రధాన కార్యదర్శి మల్కయ్య
యాలాల: మండల కేంద్రంలో అంబేడ్కర్ భవన నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 2022లో రూ.50లక్షల నిధులు కేటాయించి భవన నిర్మాణానికి శిలాఫలకం వేసిందన్నారు. భవన నిర్మాణానికి ఎకరా ప్రభుత్వ భూమిని సైతం కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. కాగా నిధులు ఉన్నప్పటికీ భవన నిర్మాణ పనులు ప్రారంభించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎమ్మెల్యే దృష్టిసారించి భవన నిర్మాణ పనులు ప్రారంభించేలా చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బెన్నూరు మాజీ ఎంపీపీ లక్ష్మప్ప, నర్సింలు, శ్రీనివాస్, రమేశ్ ఉన్నారు.

ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు

ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు

ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు