
లక్నాపూర్ ప్రాజెక్టు పరిశీలన
పరిగి: లక్నాపూర్ ప్రాజెక్ట్ వద్ద నిమజ్జన ఏర్పాట్లను శనివారం అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిమజ్జన సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం అక్కడ జరుగుతున్న నిమజ్జన ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని వినాయక నిమజ్జనానికి భక్తులు వస్తుంటారని అధికారులు తప్పకుండా పర్యవేక్షించాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా బందోబస్త్ నిర్వహించాలని పోలీసులకు సూచిం చారు. నిమజ్జనానికి వచ్చే వారు పోలీసుల, అధికారులకు సలహా, సూచన మేరకు నడుచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ వెంకటేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్