
సోదరిపై మాజీ సర్పంచ్ దాడి
పోలీస్ స్టేషన్‌లో పరస్పర ఫిర్యాదులు
బషీరాబాద్: ఓ మాజీ సర్పంచ్ తన సో దరిపై దాడికి పా ల్పడి, తీవ్రంగా గాయపర్చాడు. ఈ ఘటన బషీరాబాద్ మండలం నంద్యానాయక్‌తండాలో చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన మాజీ సర్పంచ్ శంకర్‌నాయక్, గంగ్లీబాయి కొంత కాలంగా డబ్బుల విషయమై గొడవ పడుతున్నారు. పదిహేను క్రితం హైదరాబాద్‌లో తన సోదరుడు శంకర్, వదిన సీతాబాయి తనపై దాడి చేశారని, ఇదే విషయమై వారం రోజుల క్రితం తండాలో పంచాయితీ పెట్టి మరోసారి కొట్టారని పేర్కొంది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయింది. ఇదిలా ఉండగా తన ఇంట్లో నుంచి గంగ్లీబాయి డబ్బులు చోరీ చేసిందని శంకర్ సైతం పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. సొంత అన్నాచెళ్లెల్లు కావడంతో మాట్లాడుకునేందుకు సమయం ఇచ్చామని హెడ్ కానిస్టేబుల్ రాఘవులు తెలిపారు.
రోడ్డు పక్కన దిగబడిన లారీ!
కొడంగల్ రూరల్: చైన్నై నుంచి మహబూబ్‌నగర్ మీదుగా భారీ లోడ్‌తో తాండూరు వెళ్తున్న లారీ రోడ్డు పక్కన దిగబడిపోయింది. శనివారం సాయంత్రం పర్సాపూర్ గేటు సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇచ్చే క్రమంలో డ్రైవర్ లారీని కిందకి దించాడు. రహదారి విస్తరణ పనుల్లో భాగంగా కంకర, మొరం వేసి రోడ్డుపై ఒరిగిపోయింది. శనివారం ఇటాచీ సాయంతో దీన్ని బయటకు లాగారు.

సోదరిపై మాజీ సర్పంచ్ దాడి