యావత్‌ సమాజం హర్షిస్తోంది | - | Sakshi
Sakshi News home page

యావత్‌ సమాజం హర్షిస్తోంది

Sep 6 2025 9:09 AM | Updated on Sep 6 2025 9:09 AM

యావత్

యావత్‌ సమాజం హర్షిస్తోంది

యావత్‌ సమాజం హర్షిస్తోంది మాణిక్‌రావు సేవలు మరువలేం పగిలిన భగీరథ పైప్‌లైన్‌

బీజేపీ జిల్లా అధ్యక్షుడు

డాక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి

అనంతగిరి: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం జీఎస్టీని సులభతరం చేస్తూ పేద, మధ్య తరగతి, రైతులకు ఊరట కలిగింగే నిర్ణయాలు తీసుకోవడాన్ని యావత్‌ సమాజం హర్షిస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వికారాబాద్‌లోని ఎన్నెపల్లి చౌరస్తాలో మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దినసరి, గృహ వినియోగ వస్తువుల ధరలు తగ్గడంతో జీవన వ్యయం గణనీయంగా తగ్గుతుందన్నారు. పండుగల సమయంలో పేద కుటుంబాలకు ఇది నిజమైన బహుమతి అన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు విజయ్‌కుమార్‌, రాములు, శివరాజు, ప్యాట శంకర్‌, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యుడు రమేష్‌ మహరాజ్‌

తాండూరు: తాండూరు అభివృద్ధిలో దివంగత మంత్రి మాణిక్‌రావు సేవలు ఎప్పటికీ మరచిపోలేమని ఆయన తనయుడు.. రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యుడు రమేష్‌ మహరాజ్‌ అన్నారు. శుక్రవారం మాణిక్‌రావు 94వ జయంతిని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మల్లప్ప మడిగె వద్ద ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడారు. మాణిక్‌రావు సేవలను కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు డాక్టర్‌ సంపత్‌కుమార్‌, కరణం పురుషోత్తంరావు, రవిగౌడ్‌, ఉత్తమ్‌చంద్‌, థారాసింగ్‌, పీ.బస్వరాజ్‌, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు హబీబ్‌లాల, పీసీసీ మాజీ డెలిగేట్‌ సర్దార్‌ఖాన్‌, మాజీ కౌన్సిలర్‌ రవి, యూత్‌ కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు వేణుగోపాల్‌, నాయకులు జనార్దన్‌రెడ్డి, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో..

మాజీ మంత్రి మాణిక్‌రావు జయంతిని శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించారు.

ఎగిసి పడుతున్న నీరు

రెండు రోజులుగా నిలిచిన సరఫరా

దుద్యాల్‌: మండలంలోని హస్నాబాద్‌ బస్టాండ్‌ సమీపంలో మిషన భగీరథ పైప్‌లైన్‌ పగిలిపోయి నీరంత వృథాగా పోతోంది. దీంతో గ్రామానికి నీటి సరఫరా నిలిచిపోయింది. మహబూబ్‌నగర్‌ – చించోలి జాతీయ రహదారి పనుల్లో భాగంగా రోడ్డును విస్తరిస్తున్నారు. ఈ క్రమంలో పైప్‌లైన్‌ దెబ్బతింది. రెండు రోజుల క్రితం చిన్నగా ఉన్న లీకేజీ క్రమంగా పెరిగి పెద్దగా మారింది. దీంతో నీరు భారీగా ఎగిసి పడుతోంది. గ్రామస్తులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్య అధికారులకు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ప్రైవేటు బోర్ల నుంచి తాగునీటిని తెచ్చుకోవాల్సి వస్తోందని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరారు కోరుతున్నారు. లేకుంటే ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నారు.

యావత్‌ సమాజం హర్షిస్తోంది 1
1/1

యావత్‌ సమాజం హర్షిస్తోంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement