
పింఛను వెంటనే పెంచండి
అనంతగిరి: దివ్యాంగులు, వృద్ధులు, వితంతువుల, ఒంటరి మహిళల పింఛన్ మొత్తాన్ని వెంటనే పెంచాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్ డిమాండ్ చేశారు. శుక్రవారం వికారాబాద్‌లో వికలాంగుల హక్కుల పోరాట సమితి, ఎమ్మార్పీఎస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటా ప్రకారం వెంటనే పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంఎస్‌పీ జిల్లా అధ్యక్షుడు ఆనంద్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్, నాయకులు ప్రకాష్, నర్సింలు, సుభాష్, మహేందర్, రవికుమార్, వెంకటయ్య, శివాజీ, పుష్పరాణి, కిష్టన్న, సుశీల, పద్మమ్మ ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్