
మట్టి తొలగించాలని ఫిర్యాదు
కేశంపేట: మండల పరిధిలోని వేములనర్వ గ్రామ శివారులో ఉన్న శ్మశానవాటిక వెళ్లకుండా కొందరు రియల్టర్లు మట్టిని అడ్డంగా వేసినట్టు గ్రామానికి చెందిన పలువురు మంగళవారం తహసీల్దార్ అజాంఅలీ, ఇన్‌చార్జి ఎంపీడీఓ రవిచంద్రకుమార్‌రెడ్డిలకు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. శ్మశానవాటిక పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో కొందరు వ్యక్తులతో పాటుగా రియల్టర్లు మట్టిని పోశారన్నారు. దీంతో వర్షం నీరు బయటికి వెళ్లడం లేదన్నారు. గ్రామంలో ఎవరైనా మరణిస్తే దహన సంస్కారాలకు వెళ్లడానికి వీలుకావడం లేదన్నారు. అధికారులు స్పందించి శ్మశానవాటిక నుంచి నీరు బయటికి వెళ్లే విధంగా మట్టిని తొలగించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు మల్లేష్, శ్రీను, దాసునాయక్, రాఘవేందర్, శ్రీకాంత్, శ్రీశైలం, ఎల్లయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు.